Home Page SliderNational

ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. ప్రధాని మోడీ స్పందన

ట్రిపుల్ ఆర్ మూవీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఈ విజయంపై సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రధాన మంత్రితో సహా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఈ ఘనత సాధించిన టీమ్ సభ్యులకు అభినందలు తెలుపుతున్నారు. తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాలా ప్రత్యేకమైనదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మూవీ టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు.