ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఢిల్లీలో బుధవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటంతో జనం చలికి వణుకుతున్నారు. సీజన్‌లోనే కనిష్ట ఉష్ణోగ్రత ఢిల్లీలో నమోదయ్యింది. ధర్మశాల, నైనిటాల్, డెహ్రాడూన్ కంటే దేశ రాజధానిని చల్లగా మారిపోయింది. పొగమంచు దట్టమైన పొరగా ఏర్పడటంతో 200 మీటర్లకు మించి కన్పించడం లేదు. రహదారి, రైలు ట్రాఫిక్ కదలికలపై పెను ప్రభావం పడింది. పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లే రైళ్లు.. గంటన్నర నుంచి నాలుగున్నర గంటలు ఆలస్యమైనట్లు రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు.భారతదేశ వాతావరణ శాఖ (IMD) ఇండో-గంగా మైదానాలు, దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న పొగమంచు దట్టమైన పొరను ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తోంది. పొగమంచు/తక్కువ మేఘాల పొర భారతదేశంలోని ఉత్తర, మధ్య భాగాలపై కొనసాగుతుంది, దేశంలోని పెద్ద ప్రాంతాలను కవర్ చేయడం వల్ల ఢిల్లీలో చలి తీవ్రంగా ఉందని IMD అధికారి తెలిపారు.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాలం అబ్జర్వేటరీ ఉదయం 5.30 గంటలకు 200 మీటర్ల విజిబిలిటీ స్థాయిని నమోదు చేసింది. వాతావరణ కార్యాలయం ప్రకారం, ‘చాలా దట్టమైన’ పొగమంచు అనేది 0- 50 మీటర్ల మధ్య, 51-200 మీటర్లు ‘దట్టంగా’, 201- 500 మీటర్లు ‘మితమైన’, 501-1,000 మీటర్ల మధ్య లెక్కిస్తారు. మంచుతో కప్పబడిన హిమాలయాల నుండి మంచుతో కూడిన గాలులు మైదానాల గుండా వెళ్లడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఢిల్లీ ప్రాథమిక వాతావరణ స్టేషన్ అయిన సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో కనిష్ట ఉష్ణోగ్రత ఒక రోజు క్రితం 8.5 డిగ్రీల నుండి 4.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రత ధర్మశాల (5.2 డిగ్రీలు), నైనిటాల్ (6 డిగ్రీలు) మరియు డెహ్రాడూన్ (4.5 డిగ్రీలు) కంటే ఢిల్లీలో తక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఢిల్లీ రిడ్జ్ వాతావరణ కేంద్రం బుధవారం రాజధానిలో అత్యల్ప ఉష్ణోగ్రత 3.3 డిగ్రీల సెల్సియస్‌తో చలిగాలిని నమోదు చేసింది. రాబోయే మూడు రోజుల్లో దేశ రాజధానిలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

చలి కారణంగా పవర్ గ్రిడ్‌లు దెబ్బతింటాయని భావిస్తున్నారు. లోధి రోడ్, పాలం, జాఫర్‌పూర్, మయూర్ విహార్‌తో సహా దేశ రాజధానిలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు డిగ్రీలు తగ్గడంతో మంగళవారం ఢిల్లీలో ‘చల్లని రోజు’ పరిస్థితులు నెలకొన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా లేదా సమానంగా, గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే దానిని చలి రోజుగా భావిస్తారు. సాధారణం కంటే గరిష్టంగా 6.5 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన చలి రోజు కింద లెక్క. రాబోయే నాలుగైదు రోజులలో వాయువ్య భారతదేశంలో దట్టమైన, చాలా దట్టమైన పొగమంచు, చలి పగటి పరిస్థితులను IMD అంచనా వేసింది. వచ్చే రెండు రోజుల్లో వాయువ్య భారతదేశంలో చలిగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత తీవ్రత తగ్గుతుందని పేర్కొంది.

