Andhra PradeshHome Page SliderPolitics

కందుకూరు ఘటనకు చంద్రబాబే కారణం…

కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో లో తొక్కిసలాట జరిగి, 8 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ ఘటనకు చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు విచిత్ర ధోరణి, విపరీత ప్రవర్తనే ప్రమాదానికి కారణమన్నారు. ఇరుకు రోడ్లలో మీటింగ్‌లు పెట్టి జనం ఎక్కువగా వస్తున్నారని ప్రచారం చేసుకోవడానికి, లేనిది ఉన్నట్లుగా చూపించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్లాన్‌ ప్రకారమే ఇరుకు ప్రాంతాల్లో చంద్రబాబు సమావేశాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు వాహనం నిర్దేశించిన ప్రాంతం కంటే ముందుకు తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు అధికార దాహం బయటపడిందని కాకాణి మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటావు? అని నిలదీశారు. మృతుల కుటుంబాల ఘోష చంద్రబాబుకు తగులుతుందన్నారు. కూలీ కోసం సభకు వచ్చి, అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 8 మంది మరణానికి ప్రధాన కారణమైన చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవటం ఖాయం అని కాకాణి  పేర్కొన్నారు.