Home Page SliderNational

శ్రద్ధా వాకర్ కేసు భయం వెంటాడింది.. అందుకే తునీషాతో బ్రేకప్

టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఆమె ప్రియుడు షీజన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శ్రద్ధా వాకర్ దారుణ హత్య తర్వాత… దేశంలోని జరుగుతున్న ప్రచారం తన విషయంలో ఎలాంటి సమస్యలు సృష్టిస్తుందోనని ఆమె ప్రేమకు కటీఫ్ చెప్పడంతో తునీషా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రద్ధావాకర్ వ్యవహారం తర్వాత… తునీషా శర్మతో సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్టు తెలింది. మొదటి రోజు పోలీసు కస్టడీలో, షీజాన్ ఖాన్ మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడుతూ, శ్రద్ధా వాకర్ కేసు తర్వాత తునీషా శర్మతో తన సంబంధాన్ని ముగించుకున్నానని… ఇద్దరి మధ్య వయస్సు కూడా సమస్య అయ్యిందన్నాడు. తన వయసు 28, కాగా, తునీషా వయసు 20 కావడం కూడా.. పెళ్లికి ఇబ్బందని భావించానన్నాడు.

ఐతే ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.శ్రద్ధా వాకర్‌ను ఢిల్లీలోని వారి అపార్ట్‌మెంట్‌లో ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆఫ్తాబ్ పూనావాలా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, సాక్ష్యాలను దాచడానికి అనేక ప్రదేశాల్లో విసిరారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సమయంలో… తాను ఎలాంటి చిక్కులు ఎదుర్కోరాదని… తునీషా ప్రేమకు గుడ్ బై చెప్పినట్టు షీజాన్ ఖాన్ చెప్పాడు. ఆ తర్వాత తునీషా శర్మ ఆత్మహత్యాయత్నం చేసిందని… ఇదే విషయాన్ని ఆమె తల్లి వనితకి కూడా చెప్పానన్నాడు. ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తునీషా తల్లికి చెప్పానన్నాడు. తునీషా శర్మ తన సహనటుడు షీజన్ ఖాన్ మోసం చేసి వాడుకున్నాడని ఆమె తల్లి ఆరోపించింది. షీజన్ ఖాన్‌పై తునీషా తల్లి ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం రిలేషన్ షిప్‌లో ఉన్న ఇద్దరు నటులు 15 రోజుల క్రితమే విడిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన తునీషా ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక వీడియో సందేశంలో, తునీషా తల్లి వనిత ఆరోపిస్తూ, షీజన్ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడంది. “మరో మహిళతో సంబంధం ఉన్నప్పటికీ, తునీషాతో సంబంధం కొనసాగించాడంది. మూడు-నాలుగు నెలలు ఆమెను ఉపయోగించుకున్నాడని… . షీజన్‌కు శిక్ష పడాలి, విడిచిపెట్టొద్దంది. ముంబైలోని వసాయ్ కోర్టు ఆదివారం షీజన్ మహ్మద్ ఖాన్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.పోలీసులు తునీషా మరియు షీజన్‌ల మొబైల్ ఫోన్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇద్దరి మధ్య ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇద్దరి మధ్య కాల్‌లు, చాట్‌లను తిరిగి పొందితే అసలేం జరిగిందన్నది తేలొచ్చు.