కైకాల సత్యనారాయణ కన్నుమూత
ప్రఖ్యాత నటుడు, నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 87 సంవత్సరాలు. వయోభారం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన నేడు (డిసెంబరు 23) ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. తొలుత ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు ఆయన ఇంటి వైద్యం అందించారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో చనిపోయారు. 60 సంవత్సరాల్లో 777 సినిమాల్లో సత్యనారాయణ నటించారు. రేపు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనునట్లు కుటుంబ సభ్యులు చెప్పారు
పేరు: కైకాల సత్యనారాయణ
పుట్టిన తేదీ: 25 జూలై, 1935తల్లిదండ్రులు: సీతారామమ్మ, లక్ష్మీనారాయణ
భార్య: నాగేశ్వరమ్మ
సంతానం: లక్ష్మీనారాయణ, కేవీ రామారావు, పద్మావతి, రమాదేవి
