తెలంగాణ ప్రభుత్వానికి 900 కోట్ల భారీ జరిమానా
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ సుమారు 900 కోట్ల ఫైన్ వేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ సహా అనేక ఇతర అనుమతులు లేవని… నిర్మాణాలను నిలుపుదల చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం లేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం వ్యయంలో 1.5 శాతం జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రైబునల్ చెన్నై బెంచ్ తీర్పు వెలువరించింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారంటూ కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఎన్జీటీ .. తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.