వైఎస్ షర్మిల కీలక ప్రకటన
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పాలేరు పార్టీ కార్యాలయానికి ఈనెల 16న భూమి పూజ చేస్తామని వెల్లడించారు. పార్టీ విధానాలను ఆరోజు ప్రకటిస్తానని చెప్పారు. రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షర్మిల పాదయాత్రను చేపట్టారు. అయితే.. పాదయాత్రకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, పాదయాత్ర చేసుకోవడానికి కొన్ని షరతులను విధిస్తూ.. హైకోర్టు అనుమతించింది. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని.. వ్యక్తిగత విమర్శలు చేయకూడదని నిబంధన విధించింది.