బీఆర్‌ఎస్ వైరస్‌కు బీజేపీనే వ్యాక్సిన్
తెలంగాణలో టీఆర్‌ఎస్ పని అయిపోయిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా గంగాధర మండలం తుర్గాసిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ వైరస్‌కు బీజేపీనే వ్యాక్సిన్ అని అన్నారు. తన పాదయాత్రలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టడంపై మండిపడ్డారు. తాము ఫ్లెక్సీలు కడితే టీఆర్‌ఎస్ నేతలు తట్టుకోలేరన్నారు. సొంత పార్టీ ఎమ్మల్యేలను కూడా కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. డ్రగ్ కేసును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీగా తానేం చేయాలో చేస్తున్నానని… మీరేం చేస్తున్నారో ముందు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముప్పు నిర్వాసితులను ఎందుటు పట్టించుకోలేరన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

