భారత్ – చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తత.. సైనికులకు గాయాలు
కరోనా లాక్ డౌన్ సమయంలో భారత్ – చైనా సరిహద్దుల మధ్య గల్వాన్ లోయ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆ ఘటనలో 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. అప్పట్లో ఈ ఘటన ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీంతో రెండు దేశాలు యుద్ధానికి రెడీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అందరు భావించారు.
ఇదిలా ఉంటే మరోసారి ఇప్పుడు రెండు దేశాలు సరిహద్దుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద ఘటన చోటు చేసుకున్నట్లు సైన్యాధికారి వెల్లడించారు. ఈనెల 9న ఘర్షణ జరగగా.. తాజాగా సైన్యం ఈ విషయం బయట పెట్టడం జరిగింది. తూర్పు లద్దాఖ్‌లో ఘర్ణణ తర్వాత ఈ తరహా ఘటన జరగం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి, సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టిన ఇరు దేశాల సైనికాధికారులు.. అక్కడ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.