బీజేపీ కఠిన నిర్ణయాలను ప్రజలు విశ్వసిస్తున్నారన్న మోదీ
బీజేపీ కఠినమైన నిర్ణయాలు తీసుకోగలదు కాబట్టే ప్రజలు ఓటేస్తున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ సాధించిన ప్రగతిని దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలందరూ గుర్తిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు నిజంగా ప్రజాస్వామ్య పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఒక్క బూత్‌లో కూడా మళ్లీ ఎన్నికలు లేదా రీపోలింగ్ అవసరం లేకుండా చూసుకోవడం గర్వకారణమన్నారు. గుజరాత్‌లోనే కాదు, యూపీ ఉప ఎన్నికల్లోనూ రాంపూర్‌లో భారీ విజయం సాధించామన్నారు మోదీ. ఈ ఎన్నిక వచ్చే రోజుల్లో బీహార్‌లో ఏం జరగబోతోందో ఈ ఎన్నిక సూచిస్తోందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపు-ఓటముల మధ్య వ్యత్యాసం 1% కంటే తక్కువగా ఉందన్నారు. హిమాచల్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ప్రతి 5 సంవత్సరాలకు హిమాచల్ సాధారణంగా ప్రభుత్వం మారుతుందన్నారు. అయితే అది 4-5% కంటే ఎక్కువగా ఉండేదన్నారు కానీ ఈసారి 1% కంటే తక్కువ స్వింగ్ వచ్చిందన్నారు. హిమాచల్‌లోని బీజేపీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారన్నారు. 1% కంటే తక్కువ కారణంగా విజయాన్ని కోల్పోయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ వంద శాతం కృషి చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అంటే అంతగా అభిమానం కలగడానికి కారణం.. ధైర్యంగా, కఠిన నిర్ణయాలు తీసుకునే దృఢవిశ్వాసం, ధైర్యం బీజేపీకి ఉందని దేశ ప్రజలు భావిస్తున్నారన్నారుు. కాలక్రమేణా బీజేపీకి పెరుగుతున్న మద్దతు, విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు.