దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడ్డ విద్యార్థిని మృతి
దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడ్డ విద్యార్థిని శశికళ మృతి చెందింది. నిన్న రైలు దిగుతూ ప్రమాదానికి యువతి గురైంది. అన్నవరానికి చెందిన విద్యార్థిని దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఎప్పటిలాగే కాలేజ్‌కు వెళ్ళేందుకు గుంటూరు – రాయగ్ ఎక్స్‌ప్రెస్‌లో దువ్వాడ స్టేషన్‌కు చేరుకుంది. రైలు దిగుతున్న క్రమంలో ఆమె కాలు ఫ్లాట్ ఫాం, రైలు బోగీ మధ్యలో ఇరుక్కుపోయింది. ప్లాట్ ఫాం పగులగొట్టి ఆమెను కాపాడే సమయానికి బ్లాడర్, నడుం భాగం ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని శశికళ ప్రాణాలు విడిచింది. దాంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణవార్తతో కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
