Home Page SliderNationalPolitics

2 లక్షల మెజారిటీతో దూసుకెళ్తున్న డింపుల్‌ యాదవ్‌

యూపీలోని మైన్‌పురి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. అక్టోబర్‌లో అఖిలేష్‌ తండ్రి, ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానంపై ఉప ఎన్నిక అనివార్యమైంది. తన సమీప ప్రత్యర్థిపై డింపుల్‌ రెండు లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్‌ సింగ్‌ షక్య 2,10,063 ఓట్లు పోలవగా… డింపుల్‌కు 4,10,751 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఓటింగ్‌ కొనసాగుతోంది. ఇక మైన్‌పురితో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు కూడా నేడు వెలువడ్డాయి.