NationalNews

హన్సిక పెళ్లికూతురాయెనే..!

టాలీవుడ్‌ హీరోయిన్‌, దేశముదురు ఫేమ్‌ హన్సిక మోత్వాని పెళ్లికూతురైంది. ప్రియుడు సొహైల్‌ కథురియాతో ఆమె వివాహం ఆదివారం జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు ఇప్పటికే కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. మెహందీ, సంగీత్‌, సూఫీ నైట్‌ కార్యక్రమాల్లో బంధువులంతా బిజీ అయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన సూఫీ నైట్‌ వేడుకల్లో వధూవరులు హన్సిక – సొహైల్‌ పాల్గొని అందర్నీ అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్న 32 ఏళ్ల సొహైల్‌.. నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పటికీ.. ఎప్పటికీ ఇక నీతోనే.. అని క్యాప్షన్‌ ఇచ్చారు. రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ రాజకోటలో వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగనుంది.

పెళ్లి పీటలెక్కనున్న 31 ఏళ్ల హన్సిక బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో దేశ ముదురు, తమిళంలో మాప్పిళ్లై సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ వంటి హీరోలతో వెండి తెరను పంచుకుంది. హన్సిక చేతిలో తెలుగు, తమిళంలో ప్రస్తుతం 4 సినిమాలున్నాయి. మాతా కి చౌకీ వేడుకతో పెళ్లి వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. హన్సిక, 32 ఏళ్ల సొహైల్‌ నవంబరులో పారిస్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.