నాకు ఇంకా నోటీసులు రాలేదు.. మా ఇంటికి ఎవరూ రాలేదు
సీబీఐ నోటీసులు వచ్చాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు రాలేదన్నారు. తన ఇంటికి విచారణ కోసం ఎవరూ కూడా రాలేదన్నారు. మూడు రోజులుగా ఫోన్లు స్విచాఫ్ ఎందుకు చేశారన్న విషయానికి బొంతు సమాధానం చెప్పారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఫోన్ స్విచాఫ్ చేశానన్నారు. కొందరు కావాలనే సీబీఐ అధికారులు వచ్చారని ప్రచారం చేస్తున్నారన్నారు. ఆరోపణలుంటే విచారణకు వస్తారని.. అందులో విషయం ఏముందన్నారు. కొందరు ప్రెస్ మిత్రులు కావాలని.. సీబీఐ నోటీసులు అంశాన్ని వెలుగులోకి తెచ్చారన్నారు. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్… వ్యవహారంలో తమకేం సంబంధమని ప్రశ్నించాడు బొంతు రామ్మోహన్. ఆయన చేసిన తప్పులకు మాకేం సంబంధమన్నారు. శ్రీనివాస్‌ను అనేక మంది నాయకులను ఫంక్షన్లో కలిశారన్నారు. శ్రీనివాస్ ఒకవేళ తనపేరు చెప్తే విచారణకు హాజరవుతానన్నారు. ఇప్పటి వరకు తాను శ్రీనివాస్‌ను రెండు, మూడు ఫంక్షన్లలో కలిశానన్నారు బొంతు రామ్మోహన్.

మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నానన్న రామ్మోహన్ తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. ఇప్పటి వరకు నోటీసులు రాలేదన్నారు. రాజకీయ కుట్రతోపాటుగా, కేంద్రం కుట్రలు ఉన్నాయన్నారు. సీబీఐ నోటీసులిస్తే జరిగిన విషయాన్ని చెప్తానన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై నమ్మకం ఉందన్నారు. 20 కోట్ల ట్రాన్సక్షన్లు అంటూ ప్రశ్నించగా… అలాంటివి ఏవీ లేవన్నారు. కావాలని కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఫంక్షన్లో 20, 30 మంది టీఆర్ఎస్ నాయకులు కలిశారన్నారు. ఆయన చేసే ట్రాన్సక్షన్లతో మాకేం సంబంధమని ప్రశ్నించారు బొంతు. సీబీఐ విచారణకు పిలిస్తే.. తెలిస్తే తెలుసని.. లేదంటే లేదని చెప్తానన్నారు. గంగుల కమలాకర్, వద్దపర్తి రవికి సైతం.. శ్రీనివాస్ పరిచమయ్యాడనే నోటీసులిచ్చారన్నారు. తనను పిలిచినా.. అదే చెప్తామన్నారు.

