NationalNews

ఇక రిటైల్‌ వినియోగానికి డిజిటల్‌ కరెన్సీ

డిజిటల్‌ కరెన్సీని రిటైల్‌ వినియోగానికి డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా డిజిటల్‌ రూపీని భారత సెంట్రల్‌ బ్యాంక్‌ అధికారికంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ తొలుత హోల్‌సేల్‌ చెల్లింపులో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన డిజిటల్‌ రూపీని ఇప్పుడు రిటైల్‌లోనూ నాలుగు నగరాల్లో (ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌) ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది. ఈ లావాదేవీల్లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులు పాల్గొంటాయి.

రెండో దశలో హైదరాబాద్‌లో అమలు..

డిజిటల్‌ లావాదేవీలను రెండో దశలో హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, సిమ్లా, ఇండోర్‌, కోచి, గ్యాంగ్‌టక్‌, లఖ్నో, గువహటి నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ లావాదేవీలు అందించే బ్యాంకుల జాబితాలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌ మహీంద్ర బ్యాంకులను కూడా చేరుస్తారు. రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసే రుపీని ఫోన్‌ వ్యాలెట్‌లో స్టోర్‌ చేసుకుని వినియోగదారులు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఫిజికల్‌ కరెన్సీ, నాణేల మాదిరిగానే ఇవి పని చేస్తాయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.