NewsTelangana

కాంగ్రెస్‌ పార్టీ నుంచి మర్రి సస్పెండ్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెన్షన్‌ వేటు వేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మర్రి శశిధర్‌ రెడ్డి పార్టీ మార్పుపై కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనే స్వయంగా స్పష్టత నిచ్చారు.  కాంగ్రెస్‌ పార్టీకి క్యాన్సర్‌ సోకింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ క్యాన్సర్‌తో భాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్‌ నయమయ్యే సూచనలు కనిపించడం లేదని అన్నారు. అందుకే ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ వీడాల్సి వస్తోందని వెల్లడించారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా బయటికి వస్తున్నట్లు తెలిపారు.