NewsTelangana

రాజగోపాల్‌ రెడ్డి కార్యాలయాల్లో సోదాలు

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజగోపాల్‌ రెడ్డి కుమారుడు సంకీర్త్‌ రెడ్డి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ పన్ను ఎగవేసినట్లు వచ్చిన ఆరోపణలపై సోమవారం మధ్యాహ్నం నుంచి సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లో గల కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని పలు చోట్ల తనిఖీల్లో అధికారుల చేతికి పలు కీలక పత్రాలు లభించినట్లు సమాచారం.