ఓటీటీ షోకు హోస్ట్‌లుగా ‘మీర్జా మాలిక్’
ఇటేవలే సానియా మీర్జా త్వరలో విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సానియా మీర్జా దంపతులు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ దంపతులు కలిసి త్వరలో ఓ షో చేయబోతున్నారు. ప్రముఖ పాకిస్తానీ ఓటీటీ ప్లాట్ ఫాం ఉర్దూ ఫ్లెక్స్‌లో ‘మీర్జా మాలిక్’ అనే టాక్ షో మొదలుకానుంది. ఈ కార్యక్రమంలో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కలిసి హోస్ట్‌గా చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ఉర్దూ ఫ్లెక్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టమవుతుంది. 2010 ఏప్రిల్‌లో సానియా, షోయబ్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ దంపతులు దుబాయ్‌లో నివసిస్తున్నారు.
