ఎమోషనల్, యాక్షన్, థ్రిల్లర్ చిత్రం యశోద
నటీనటులు : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, సంపత్, శత్రు తదితరులు
ఎడిటింగ్ : మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ : ఎం. సుకుమార్
మ్యూజిక్ : మణిశర్మ
ప్రొడ్యూసర్ : శివలెంక కృష్ణ ప్రసాద్
స్టోరీ-స్ర్కీన్ ప్లే – దర్శకత్వం : హరి హరీష్
రిలీజ్ డేట్: 11-11-2022
టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్‌లను తన యాక్టింగ్‌తో మెప్పిస్తూ తనకంటూ ఓ బ్రాండ్‌ను దక్కించుకున్న హీరోయిన్ సమంత. ఈ స్టార్ హీరోయిన్ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇంతకు ముందు ఆమె చేసిన యూ టర్న్, బేబి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ కోవలో సమంత చేసిన మరో చిత్రమే `యశోద.’ సరోగసీ వెనుక జరిగే క్రైమ్ పాయింట్‌తో `యశోద’ సినిమాను రూపొందించారు. అసలు సరోగసీ వెనుక ఎలాంటి క్రైమ్ జరిగింది? సినిమా దర్శకుడు హరి- హరీష్ ఎలా తెరకెక్కించారు? సమంత `యశోద’ పాత్రకు న్యాయం చేసిందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సినిమా స్టోరీ :
పేదింటికి చెందిన యశోద (సమంత). ఆమెకు అనారోగ్యంతో ఉన్న చెల్లెలు. తన చెల్లి ఆపరేషన్ కోసం సరోగసీని ఎంచుకుంటుంది. సరోగసీకి ఒప్పుకుంటే భారీగా డబ్బొస్తుందని, తన చెల్లెలి వైద్యానికి ఆ డబ్బు ఖర్చు చేయొచ్చని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సరోగసీ గర్భవతులందరన్నీ ఒక రహస్య స్థావరంలో ఉంచుతారు. ఆ చోటు చాలా పాష్‌గా సకర సౌకర్యాలతో నిండి ఉంటుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ఒక పెద్ద ప్రమాదాన్ని పసిగడుతుంది యశోద. తనతోపాటు పాటు బిడ్డలకి జన్మనివ్వడం కోసం ఆస్పత్రిలో చేరిన తోటి మహిళలు అనుమానాస్పద రీతిలో మాయమయిపోతుంటారు. ఇంతకీ ఆ మహిళలు ఏమవుతున్నారు? ఆ క్రమంలో ఆమెకి ఎలాంటి రహస్యాలు తెలిశాయి? అదేమిటనేది మిగతా కథ. మొత్తంగా ఇదొక క్రైం థ్రిల్లర్ జానర్‌లో తీసిన చిత్రం.

ఈ సినిమాలో సమంత ప్రాణం పోశారని చూస్తేనే అర్థమవుతుంది. యశోద పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. అలాగే యాక్షన్ సీన్స్ అదరగొట్టింది. ఆమె స్టంట్స్ సూపర్బ్. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పాత్ర బాగుంది. ఈయన పాత్రకు ట్విస్ట్ ఇచ్చినా ముందుగానే అర్థమవుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్ తమ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. సంపత్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. సమంత చెల్లిగా ప్రీతి అస్రానికి మంచి మార్కులు పడ్డాయి. శత్రు కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. తగిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు.

మణిశర్మ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. టాప్ ఫెర్మార్మింగ్ ఆర్టిసులతో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మంచి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించారు. సిస్టర్ సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కలబోసిన సినిమా యశోద. ఫస్టాఫ్‌లో కొంత స్లో నేరేషన్ తప్పితే.. సినిమా అంతా చకచకా సాగిపోతుంది. సమంత కెరీర్‌లోనే బెస్ట్ సినిమాలో యశోద ఒకటిగా నిలుస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రేక్షకులు యశోద సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదిరిపోయే ట్విస్టులతో సినిమా సూపర్‌గా ఉందని ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

