రేపు మోదీతో పవన్ కల్యాణ్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీతో పవన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్ పాల్గొంటారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రేపు ప్రత్యేక విమానంలో పవన్ విశాఖ చేరుకోనున్నారు. 2 రోజుల పాటు ఆయన విశాఖలో పర్యటిస్తారని జనసేన పార్టీ తెలిపింది.

