NationalNews

యూపీలో డిసెంబరు 5న ఉప ఎన్నికలు

ఉత్తర ప్రదేశ్‌లో 2 అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటుకు డిసెంబరు 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఖైతౌలి, రాంపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గాలకు, మైన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2013 ముజఫర్‌ నగర్‌ అల్లర్లలో దోషిగా తేలడంతో ఖతౌలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌ సింగ్‌పై ఈసీ అనర్హత వేటు వేసింది. విద్వేష ప్రసంగాల కేసులో దోషిగా తేలిన రాంపూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌పై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది. మైన్‌పురి ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి చెందడంతో అక్కడా ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది.