NationalNews

హిందువు అర్థం తెలుసుకుంటే సిగ్గుపడతారు- కర్నాటక కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు

హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని, దాని మూలం భారతదేశంలో లేదని కర్నాటక కాంగ్రెస్ అగ్రనేత సతీష్ లక్ష్మణ్‌రావ్ జార్కిహోళి పెద్ద వివాదానికి కారణమయ్యారు. హిందు పదం… పర్షియన్ నుండి వచ్చిందన్నాడు. భారత్‌తో సంబంధం లేని పదాన్ని ప్రజలు ఎలా అంగీకరిస్తారని జార్కిహోలీ ప్రశ్నించాడు. హిందూ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది… అది మనదేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పర్షియన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ప్రాంతానికి చెందినదన్నాడు. హిందూ అనే పదానికి భారత్‌తో సంబంధం ఏంటన్నాడు. అలాంటప్పుడు దానిని ఎలా అంగీకరిస్తారమన్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై చర్చ జరగాలన్నాడు జార్కిహోళి. కర్నాటక కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు… సోషల్ మీడియాలో దుమారానికి కారణమవుతోంది.

ఇది హిందువులను అవమానించడమేనని… మరియు రెచ్చగొట్టడం అని బీజేపీ మండిపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసర వివాదాలు సృష్టించవద్దని కర్నాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్నారయన్ సీఎన్ కాంగ్రెస్‌ను కోరారు. ప్రజల మనోభావాలు, సంస్కృతిని కాంగ్రెస్ గౌరవించాలని… గందరగోళం సృష్టించొద్దన్నారు. హిందువుల మనోభావాలను గౌరవించాలని… విమర్శించే బదులు సంస్కృతిని గౌరవించాలన్నారు. అనవసర వివాదాలు సృష్టించి.. రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు.

కర్నాటక నేత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రతి మతం, విశ్వాసం & విశ్వాసాన్ని గౌరవించేలా మన దేశం నిర్మించబడిందని… ఇది చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. హిందూత్వం ఒక జీవన విధానం, నాగరికత వాస్తవికత అని… ప్రతి మతం, నమ్మకం & విశ్వాసాన్ని గౌరవించేలా కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని నిర్మించిందన్నారు. జార్కిహోళికి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రకటనను పూర్తిగా ఖండిస్తోందన్నారు. నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామన్నారు.

జార్కిహోళి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. బెళగావి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.