బుక్ చేసిన వెంటనే స్కూటర్ డెలివరీ…
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై ఓలా ప్రత్యేక దృష్టి పెట్టింది. కస్టమర్లు బుక్ చేసిన వెంటనే ఓలా స్కూటర్ డెలివరీ చేయనుంది. వచ్చే వారం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ట్విట్టర్లో తెలిపారు. మెట్రో సిటీ కస్టమర్లకు బుక్ చేసిన రోజే డెలీవరీ చేస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల వారికి రెండు రోజులకే అందిస్తామని తెలిపారు. పట్టణాలవాసులకు స్కూటర్ డెలివరీ కొద్దిగా డెఫరెంట్గా ఉండనుంది. ఓలా ఎక్స్ పీరియన్స్ కేంద్రాలకు వెళ్లి.. లేదంటే ఆన్లైన్లోనూ, లేదంటే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈ సంస్థ 70వేల స్కూటర్లను సేల్స్ చేసింది.

