NewsTelangana

టీవీ చానెళ్ల కంగారు..

మునుగోడు ఉప ఎన్నికల పోరులో రాజకీయ పార్టీలతో పాటు టెలివిజన్‌ చానెళ్ల కంగారు కూడా పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల రోజు ఈ పోటీలో భాగంగా చానెళ్ల వాళ్లు ముందే ఇవ్వాలన్న తొందరలో కన్‌ఫ్యూజ్‌కు గురయ్యారనిపిస్తోంది. ఎందుకంటే రౌండ్‌ వారీగా ఫలితాల్లో అభ్యర్థికి లభించిన ఓట్లు, ఆధిక్యతలో ఒక్కో చానెల్‌ ఒక్కో విధంగా చూపిస్తున్నాయి. నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 613 ఓట్ల ఆధిక్యత లభించిందని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చూపిస్తుంటే.. 714 ఓట్ల ఆధిక్యతను టీఆర్‌ఎస్‌ సాధించిందని వీ6 చానెల్‌ చూపిస్తోంది. టీవీ 9 చానెల్లో తొలుత 313 ఓట్ల ఆధిక్యత అని తర్వాత 714 ఓట్ల ఆధిక్యత అని చూపించింది.