తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లిన 6గురు విద్యార్థులు మృతి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో తీవ్ర విషాదం చొటుచేసుకొంది. మల్కాపురం చెరువులో పడి ఆరుగురు మృతి చెందారు. మృతులు అంబర్ పేటలోని మదరసా విద్యార్థులుగా గుర్తించారు. ఈతకు దిగిన విద్యార్థులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. విద్యార్థులను టూర్ కోసం బయటకు తీసుకువెళ్లగా ఈ ఘటన జరిగింది. విద్యార్థులను రక్షించందుకు ఉపాధ్యాయుడు నీటిలో దిగినా.. విద్యార్థులు బయటకు తీసుకురాలేకపోయారు. గజ ఈతగాళ్లతో గాలించి విద్యా్ర్థుల మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కాచిగూడ నెహ్రూ నగర్‌కు చెందినవారిగా నిర్ధారించారు. చనిపోయిన విద్యార్థులు 12 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నవారే.