మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ పార్టీదే.. ఆరా సర్వేలో వెల్లడి
ప్రతిష్టాత్మక ఆరా సంస్థ మునుగోడులో ఎవరు గెలుస్తారన్నదానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించబోతున్నట్టు స్పష్టం చేసింది. మొత్తం పోలైన ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ 50.82, ప్లస్ ఆర్ మైనస్ మూడు శాతంగా పేర్కొంటే, బీజేపీ 33.86 ప్లస్ ఆర్ మైనస్ 3 శాతంగా పేర్కొంది. ఇక కాంగ్రెస్ పార్టీ 10.94 శాతం ప్లస్ ఆర్ మైనస్ 2 శాతంగా, ఇతరులు 4.38 శాతం ప్లస్ ఆర్ మైనస్ రెండు శాతంగా సర్వే అభిప్రాయాన్ని వెల్లడించింది. సర్వే లెక్క ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి పురుషులు 49.13 శాతం ఓటేయగా, బీజేపీకి 34.33 శాతం, కాంగ్రెస్ పార్టీకి 11.17 శాతం, ఇతరులకు 5.32 శాతం ఓట్లు వేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఇక మహిళల విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 58.13 శాతం, బీజేపీకి 29.12 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.56 శాతం, ఇతరులకు 4.17 శాతం మేర ఓట్లు పోలైనట్టు తేలింది.
ఇక వయసుల వారీగా పరిశీలిస్తే 18-25 ఏళ్ల వయసు ఉన్నవారిలో టీఆర్ఎస్ పార్టీకి 40.79 శాతం, బీజేపీకి 40.40 శాతం, కాంగ్రెస్ పార్టీకి 12.67 శాతం, ఇతరులకు 6.14 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆరా అంచనా వేసింది. ఇక 26-40 ఏళ్ల వయసున్న వారిని పరిశీలీస్తే టీఆర్ఎస్‌కి 49.17 శాతం, బీజేపీకి 33.45 శాతం, కాంగ్రెస్ పార్టీకి 11.91 శాతం, ఇతరులకు 5.47 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని తేలింది. ఇక 41-60 ఏళ్ల వయసున్నవారిలో టీఆర్ఎస్ పార్టీ పట్ల 54.37 శాతం, బీజేపీకి 31.97 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.94 శాతం, ఇతరులకు 4.72 శాతం ఓట్లు రావొచ్చు. ఇక 60 ఏళ్ల పైబడినవారిని పరిశీలిస్తే టీఆర్ఎస్‌కి 64.46 శాతం, బీజేపీకి 26.31 శాతం, కాంగ్రెస్ పార్టీకి 4.92 శాతం, ఇతరులకు 4.31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఇక కులాల వారీగా టీఆర్ఎస్ అన్ని వర్గాల ఆదరణ పొందినట్టుగా తేలింది. ఇక మొత్తం 22 వార్డుల్లో 2, 8, 14,19,22 వార్డులో హోరాహోరీ జరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 9వ వార్డు తప్పించి మిగతా వార్డుల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబర్చే అవకాశం ఉంది.

