ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గెజిట్ విడుదల
ఏపీలో వైద్య విద్యను పర్యవేక్షించే ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్ట సవరణను చేశారు. దీనికి అనుగుణంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చుతూ సోమవారం నాడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి కృష్ణబాబు ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
