మునుగోడు ప్రజలు టీఆర్ఎస్కి బుద్ధి చెబుతారు
8 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ నట్టేట ముంచారన్నారు. మంత్రి కేటీఆర్ కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మునుగోడే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసి.. కుటుంబ పాలనతో లక్ష కోట్లు దోపిడీ చేశారని, వాళ్ళ వ్యతిరేకంగానే ఈ ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. మునుగోడులో వచ్చే తీర్పు వల్లనే తెలంగాణాలో మార్పు జరిగి కుటుంబ పాలన అంతమయి ప్రజాస్వామ్యం వస్తోందని ధీమా వ్యక్తం చేశారు.