మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత
సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంత కాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా సమంత హాస్పిటల్ బెడ్‌పై ఉండి చేతికి సెలైన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోని సమంత షేర్ చేస్తూ ఓ కొటేషన్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను గత కొంత కాలం నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలిపారు. అందుకే తాను ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నానని ఈ సందర్భంగా ఫోటోని షేర్ చేస్తూ తన సమస్యను బయటపెట్టారు. అయితే డాక్టర్లు తాను త్వరలోనే కోలుకుంటానని చెప్పినట్లు సమంత వెల్లడించారు. ఇక తన జీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మంచి చెడు రోజులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత పోస్టుపై ఎంతో మంది సెలబ్రిటీలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొంరగా సమంత కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

మయోసైటిస్ అంటే ఏంటీ.. దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
మయోసైటిస్ అనేది ఒక అరుదైన వ్యాధి. ఈ వ్యాధిలో పలు రకాలుగా ఉంటుంది. 1. పాలిమయోసైటిస్ 2. డెర్మటోమయోసైటిస్ 3. ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్.
పాలిమయోసైటిస్ లక్షణాలు : ఈ వ్యాధికి బారినపడి వారు చిన్న చిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పి పెడతాయి. కొంత దూరం నడిచినా తరువాత అలసిపోయి కింద పడిపోతారు.
డెర్మటోమయోసైటిస్ లక్షణాలు : కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్ లక్షణాలు : నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి. 50 వయసు దాటిన వారి ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. మరి సమంత ఏ లక్షణాలతో బాధపడుతుందో మాత్రం వెల్లడించలేదు.