టీ తాగిన గ్లాసును తినొచ్చు… అది ఎక్కడంటే?
మన రోజువారీ జీవితంలో `చాయ్’ కు ఓ ప్రత్యేకత ఉంది. టీ త్రాగడం మన భారతీయులకు ఒక అలవాటు.. ఇది నిరంతరం పెరుగుతూనే ఉంది. భారతదేశంలో ప్రతి రెండవ వ్యక్తికి టీ అంటే చాలా ఇష్టమని చెబుతారు. టీ చాలా గొప్పగా ఉన్నప్పుడు దానికి రుచిని జోడించడానికి అనేక ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అలాంటిదే.. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కొత్త ఐడియాతో టీ అమ్ముతున్నాడు. టీ తాగిన గ్లాసును పడేయకుండా కోన్ ఐస్క్రీంను తయారు చేసే బిస్కెట్ వంటి పదార్థంతో గ్లాసుగా తయారు చేసి టీని పోసి ఇస్తున్నాడు. టీ తాగిన తర్వాత దానిని పడేయకుండా మనం తినేయవచ్చు. దీంతో ఈ టీ కోసం జనాలు క్యూ కట్టి మరి టీని ఎంజాయ్ చేస్తున్నారు. రోహిణి కాలనీలోని శివ చౌక్‌లో ఇష్క్-ఎ-చాయ్ పేరుతో స్టోర్‌ను ఏర్పాటు చేసి యువకుడు ఫేమస్ అయ్యాడు. బటర్ స్కాచ్, రోజ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌తో టీ కూడా అందుబాటులో ఉంది.

