అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష్మి చెప్పారు. నల్గొండ జిల్లా చండూరులో ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడున్నరేళ్లు ఎంత కొట్లాడినా మునుగోడు అభివృద్ధికి కేసీఆర్ నిధులివ్వలేదని ఆరోపించారు. తన రాజీనామాతోనైనా నిధులు వస్తాయన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెశారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటు వేసి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.