Andhra PradeshNews

మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు

మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. మునుగోడు ఉప ఎన్నికల బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. ఉప ఎన్నికలకు సంబంధించి 130 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో 47 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరికి పోటీలో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి 15 మంది పోటీ చేయగా.. ఈసారి అభ్యర్థుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇక ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల కారణంగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉండటంతో.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.