NationalNews

కాంతార పై ఆర్జీవీ ట్వీట్

కాంతార.. ఈ పేరు తెలియని వారు ఎవ్వరు ఉండరూ. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసులో భారీ కలెక్షన్స్ అందుకుంటోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్మకత్వం వహించిన ఈ సినిమా కన్నడలోనూ రికార్డులు బద్దలు కొట్టింది. అదే విధంగా తెలుగులోనూ భారీ సంఖ్యలో కలెక్షన్స్ వసూలు చేస్తు పెద్ద సినిమాల రికార్డులను షేక్ చేస్తోంది. దీంతో అందరు ఈ సినిమా పై కామెంట్ల వర్షం కురిసిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్ గురించి రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కేవలం సూపర్ స్టార్స్ , మాసివ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ , స్పెక్టాక్యులర్ వీఎఫ్ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలమని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్న తరుణంలో పేరు లేని చిన్న సినిమా పెద్ద సినిమాల రికార్డులు బద్దలు కొడుతోందని ట్వీట్ చేశాడు. కాంతార విడుదల మొదటి రోజు 1.95 కోట్ల గ్రాస్‌ను సాధించింది. అదే విధంగా రెండవ రోజు కూడా 11.5 కోట్ల విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్‌ని తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే దక్కించుకుంది. ఈ సినిమా విజయానికి క్లైమాక్స్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పోచ్చు.