National

దీపావళికి వీవర్క్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

దీపావళి కానుకగా వీవర్క్ కంపెనీ ఉద్యోగులకు మంచి ఆఫర్ ఇచ్చింది. పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ దీపావళిని జరుపుకునేందుకు , అదే విధంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా 10 రోజులు సెలవులు ప్రకటించింది.  భారత్‌లో పనిచేసే తమ ఉద్యోగులు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  సంస్థ ‘ పీపుల్స్ అండ్ కల్చర్ ’ విభాగాధిపతి ప్రీతి శెట్టి తెలిపారు. వీటి ద్వారా తమ ఉద్యోగులుకు తగినంత విశ్రాంతి అలానే కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దోరుకుతుందని చెప్పారు. అంతే కాకుండా తిరిగి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేసేందుకు ఈ సెలవులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇప్పటికే తమ కంపెనీ అనుకున్న లక్ష్యాలను చేరుకుందని , దానికి కృతజ్ఞతగా ఈ సెలవులు ఆఫర్ చేసినట్టు తెలిపారు. వాస్తవానికి 2021లోనే ఈ విధానాన్ని ప్రారంభించమని.. సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు ప్రీతి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మీషో సైతం గత నెల తమ ఉద్యోగులకు 11 రోజులు సెలవులు ఇచ్చింది. తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం తమకు ముఖ్యమని అందులో భాగంగానే 11 గోజులు సెలవులు ఇచ్చినట్టు మీషో తెలిపింది.