International

“పేరు గుర్తుంచుకోండి” సచిన్ ట్వీట్ వైరల్

క్రికెట్ ప్రపంచంలో ఏది, ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు అనుకోని సంచలనాలు నమోదు అవుతూ ఉంటాయి. అలాంటిదే టీ 20 ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో జరిగింది. క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టును క్రికెట్‌లో పసికూన లాంటి నమీబియా జట్టు ఓడించేసింది. దీనితో నమీబియా జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా నమీబియాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. నా పేరు గుర్తు పెట్టుకోమంటూ నమీబియా ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చిందని ఆ ట్వీట్ సారాంశం. ఇది బాగా వైరల్ అయ్యి, రీట్వీట్‌లు మొదలయ్యాయి. సచిన్‌తో పాటు మాజీ క్రికెటర్లు చాలామంది పోస్టులు పెట్టారు.