విశాఖ గర్జన సభలో.. గర్జించిన రోజా
ఈ రోజు విశాఖలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ గర్జన ర్యాలీలో వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు కూడా నేతలు హాజరయ్యారు. ఈ సభలో వైసీపీ మంత్రులు మాట్లాడారు. రాజధాని వికేంద్రికరణతో రాష్ట్రమంతా అభివృద్ది చేయాలని సీఎం జగన్ సంకల్పించారన్నారన్నారు మంత్రి రోజా. జగన్ పిలుపునకు ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలిపారన్నారు. కాబట్టే ఉత్తరాంధ్ర ప్రజలు ఈ విశాఖ గర్జనకు సునామీల వచ్చారన్నారు.

జన సునామీలో చంద్రబాబు,పవన్‌కళ్యాణ్ కొట్టుకుపోవాలన్నారు రోజా. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రతిపక్షాలకు చూపించాలన్నారు. రాబోయే ఎన్నికలలో జగన్‌ను మళ్లీ గెలిపించి ప్రతిపక్షాలకు ఉత్తరాంధ్ర ప్రజల తడాఖా ఎంటో తెలియజేయాలన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తన సినిమా షూటింగ్‌లు, కలెక్షన్లకు మాత్రమే విశాఖ కావాలన్నారు. అలాగే ఆయన పోటీ చేయడానికి కూడా విశాఖ కావాలి. కానీ విశాఖ రాజధానిగా మాత్రం వద్దా? అని రోజా ప్రశ్నించారు. రాష్ట్రంలో పెయిడ్ ఆర్టిస్ట్‌లను సపోర్ట్ చేస్తున్న పవన్‌ను తరిమికొట్టాలన్నారు. చంద్రబాబుకు రాష్ట్రంలో 29 గ్రామాల అభివృద్ది మాత్రమే ముఖ్యమన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అన్నీ ప్రాంతాల అభివృద్దిని కోరుకుంటుదన్నారు. రాష్టంలో వైసీపీ ప్రజా పోరాటం చేస్తుంటే… చంద్రబాబు రియల్ ఎస్టేట్ పోరాటం చేస్తున్నారని రోజా ఆరోపించారు.