Telangana

ర్యాలీకి వెళ్తే..రూ.500, పెట్రోల్, మందు!

మునుగోడు ఉపఎన్నిక సాదాసీదా ఉపఎన్నిక కాదు. మూడు పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వందల కోట్ల రూపాయలను ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చు పెట్టేస్తున్నాయి. ఉపఎన్నిక మునుగోడు ఓటర్లకు ఉపాధినిస్తుందనే చెప్పాలి. ఊళ్లలోని వృద్దులు, మహిళలకు డబ్బులిచ్చి వివిధ పార్టీలు ర్యాలీలకు తీసుకెళ్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషకు వేల మందితో ర్యాలీ తీశారు. ఇందుకు బయల్దేరిన ఓ వ్యక్తిని ర్యాలీకి వెళ్తున్నందుకు ఏమైనా ఇస్తున్నారా? అని ఓ రిపోర్టర్ అడిగితే..రూ.500, బండిలో పెట్రోల్, మందు అని సమాధానం ఇచ్చాడు. మరో వ్యక్తి కూడా ఇలాగే సమాధానం ఇచ్చాడు. ఆన్ లైన్ ద్వారా కూడా డబ్బులు పంచుతున్నారు. కాగా ఇది టీఆర్ఎస్‌కే పరిమితం కాలేదు. మిగతా పార్టీలదీ ఇదే వరుస అంటున్నారు మునుగోడు జనం