NewsTelangana

మునుగోడు ఉప ఎన్నికలో గద్దర్ ను ఆపిందెవరు?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి గద్దరు ఝలక్ ఇచ్చారు. ప్రజా గాయకుడు గద్దర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. మునుగోడు ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని గతంలో కేఏ పాల్ ప్రకటించారు. కాని ప్రజాశాంతి పార్టీ తరఫున తానే నామినేషన్ దాఖలు చేశారు కేఏ పాల్. గద్దర్‌ను నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. కేఏ పాల్ ప్రకటన అలా ఉన్నా.. గద్దర్ తనకు తానుగా మునుగోడు పోటీ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. గద్దర్ దసరా పండుగ రోజున ప్రజాశాంతి పార్టీలో చేరారు. అప్పుడే మునుగోడు నుంచి తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ ను ప్రకటించారు కేఏ పాల్. తర్వాత గద్దర్ టీజేఎస్ అధినేత కోదండరామ్ ను కలిశారు . దీంతో ప్రజా శాంతి పార్టీ నుంచి కాకుండా టీజేఎస్ అభ్యర్థిగా గద్దర్ బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. కాని టీజేఎస్ పార్టీ తమ అభ్యర్థిగా పల్లె వినయ్ కుమార్ ను ప్రకటించింది . దీంతో చివరి రోజున ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ నామినేషన్ వేస్తారని అంతా భావించారు. కాని గద్దర్ నామినేషన్ వేయలేదు. గద్దర్ నామినేషన్ వేయకపోవడంపై కేఏ పాల్ స్పందించారు. గద్దర్ ను మునుగోడు అభ్యర్థిగా ప్రకటించడంతో ఇతర పార్టీలు ఆయనపై ఒత్తిడి చేశాయని పాల్ ఆరోపించారు.