గిఫ్ట్‌గా విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్
ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎంకు కోహ్లీ సైన్ చేసిన బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్ . కాన్బెర్రాలో ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్‌తో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు. రెండు దేశాలను కలిపే క్రికెట్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను బహుమతిగా ఇవ్వడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. క్రికెట్‌పై మనకున్న ప్రేమతో పాటుగా మనల్ని ఎన్నో విషయాలు ఒక్కటి చేస్తున్నాయన్నారు. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌తో ఆశ్చర్యపరిచాడంటూ ట్వీట్ చేశారు ఆస్ట్రేలియా డిప్యూటీ సీఎం మార్లెస్. ఆస్ట్రేలియా రక్షణ మంత్రిగా ఉన్న మార్లెస్‌తో సమావేశంలో జైశంకర్ ప్రాంతీయ, ప్రపంచ భద్రతపై అనేక అంశాలు చర్చించారు. పరస్పర అభిప్రాయాలు, పెరుగుతున్న రక్షణ, భద్రతా సహకారం శాంతియుత, సుసంపన్నమైన, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్‌ను నిర్ధారిస్తుందని తెలిపారు
న్యూజిలాండ్‌లో విజయవంతమైన పర్యటన తర్వాత జైశంకర్ కాన్బెర్రా చేరుకున్నారు. ఆస్ట్రేలియాలోని పాత పార్లమెంటు భవనం భారత జాతీయ జెండా రంగుల్లో వెలిగిపోతు తరుణంలో కాన్‌బెర్రాకు చేరుకున్నాడు. విదేశీ వ్యవహారాల మంత్రి ఆస్ట్రేలియన్ కౌంటర్ పెన్నీ వాంగ్‌తో కలిసి 13వ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశం తరువాత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయన్నారు. రెండు దేశాల బంధాన్నిముందుకు తీసుకెళ్లేలా.. పనిచేస్తున్నామన్నారు. కాన్బెర్రాలో ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్‌తో జైశంకర్ సమావేశమయ్యారు. నాణ్యమైన విద్య యొక్క ప్రాముఖ్యత, గ్లోబల్ వర్క్‌ప్లేస్ కోసం సిద్ధం కావాల్సిన అవసరం గురించి చర్చించారు. ఆస్ట్రేలియా విద్యా మంత్రి జోసన్ క్లార్ తో భేటీ కావడం కలవడం ఆనందంగా ఉందన్న జైశంకర్.. నాణ్యమైన విద్య ప్రాముఖ్యత, అంతర్జాతీయ దృక్పథం, గ్లోబల్ వర్క్‌ప్లేస్ కోసం ఇరువురం చర్చించామన్నారు.
