NewsTelangana

హైదరాబాద్‌లో ఇవాళ,రేపు భారీ వర్షాలు

హైదరాబాద్‌లో డిఫరెంట్ వెదర్ ప్రజలను ముప్పతిప్పలు పెడుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం వరకు వాతావరణం ఎండతో వేడిగా ఉంటుంది. ఆ  తర్వాత సాయంత్రం కల్లా కారు మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్‌లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో హఠాత్తుగా ఏర్పడుతున్న పరిణామాలతో జనజీవనం అస్తవ్యస్థం అవుతుంది. అయితే ఈ విషయంపై హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు స్పందించారు. రుతుపవనాలు ముగిసేవరకు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఈ రోజు,రేపు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు.