మునుగోడులో ఊపందుకున్న బైపోల్ ప్రచారాలు
తెలంగాణా రాజకీయాలలో మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార,ప్రతిపక్ష పార్టీలు మునుగోడులో జెండా ఎగురవేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మునుగోడు ఉపఎన్నికల నిమిత్తం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ఇవాళ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌కు రాజగోపాల్‌రెడ్డి భారీ బైక్ ర్యాలీతో వెళ్లనున్నారు. ఈ నామినేషన్‌కు సునీల్ బన్సల్ ,తరుణ్ చుగ్, డీకే అరుణ హాజరుకానున్నారు. అంతేకాకుండా మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల కూడా ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. కూసుకుంట్ల తరుపున ఆయన అనుచరులు ఈ నామినేషన్‌ను సమర్పించనున్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా ఈ ప్రచారం పాల్గొంటున్నారు.