నేను ఎన్నికల్లో పోటీ చేయనంతే…
గత కొద్ది రోజులుగా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. అది కూడా అధికార వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ ఎంపీగా నాగార్జునను, వైసీపీ దింపబోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయ్. ఐతే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు నాగార్జున. నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఘోస్ట్ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. విజయవాడ ఎంపీగా తాను పోటీచేయడం లేదన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్న ఆయన… ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయనన్నారు. మంచి కథ దొరికితే మాత్రం పొలిటికల్ లీడర్ గా నటిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రచారం చేస్తూనే ఉన్నారన్నారు. కానీ తనకు ఆ ఉద్దేశం లేదని… సినిమాలు మాత్రమే చేస్తానన్నారు.
