నెల్లూరు జిల్లా ముదివర్తి దగ్గర పెన్నానది ఉధృతి
రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలోని పెన్నానది అయితే ఈ భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చింది. దీంతో నెల్లూరు జిల్లాలోని ముదివర్తి దగ్గర పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ చేపల వేటకు కొంతమంది వెళ్ళారు. అయితే వారు ఈ వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. దీంతో వారు సాయం చేయాలంటూ ఆర్తనాదాలు చేశారు. దీనిని గమనించిన అధికారులు గజ ఈతగాళ్ళను పంపి తక్షణమే వారిని కాపాడారు. ఈ ప్రవాహంలో చిక్కుకున్న వారిలో ఒక యువకుడితో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.