Andhra Pradesh

15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయ్. సమావేశాలు 5 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 15న ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే… అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు సైతం జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోన్నట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రులు సైతం మూడు రాజధానుల బిల్లు పెట్టి తీరతామని… త్వరలోనే విశాఖ కార్యనిర్వాహక రాజధాని నుంచి పాలన జరుపుతామంటూ తేల్చి చెబుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ ఆసక్తికరంగా మారనుంది.