NationalNews

16న హైదరాబాద్‌కు అమిత్‌ షా

బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి తెలంగాణాకు రానున్నారు. ఈ నెల 16న రానున్న అమిత్‌ షా 17వ తేదీన పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులతో సమావేశం అవుతారు. ఇటీవల మునుగోడు సభలో అమిత్‌ షా పాల్గొన్న విషయం తెలిసిందే.