రవీంద్ర జడేజా స్ధానంలో అక్షర పటేల్
గాయాల బారిన పడ్డ రవీంద్ర జడేజా ఆసియా కప్ కు దూరమయ్యాడు. తర్వాత జరగాల్సిన అన్ని మ్యాచ్ లకు జడేజా ఇక అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం అతను మోకాలి గాయంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఆసియా కప్ లో ఇండియా సూపర్ 4 దశకు చేరిన దశలో రవీంద్ర జడేజా టీమ్ లో లేకపోవడం చాలా లోటేనని భావిస్తున్నారు. అయితే ఆయన స్ధానంలో అక్షర పటేల్ ను టీమ్ లోకి తీసుకున్నారు. ఆసియా కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో భారత్ తరపున జడేజా మంచి ఆట తీరును ప్రదర్శించాడు.
Read more: మంకీపాక్స్ కలకలం..ఏకంగా 31మందికి
