Andhra PradeshNews

తిరుపతిలో మొదలైన భక్తుల రద్దీ

హిందువులు అత్యంత  పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రంలో తిరిగి భక్తుల రద్దీ మొదలయ్యింది. . ఇటీవల ప్రజలకు వరుస సెలవులు దొరకడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు ప్రయాణం కట్టారు. ఈ నెలలో పర్వదినాలు ఎక్కువగా ఉండడంతో భక్తులు దర్శనానికి బారులుతీరారు. ఈ నేపథ్యంలో తిరుమలలో 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. దీంతో ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజులో 69,012 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 29,195 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.. భక్తులు తమ మొక్కులు, ముడుపులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే రూ.4.59 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలియజేసారు.