Andhra PradeshNews

గణేష్‌ మండపాలపై రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్‌ మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నారని సోషల్‌ మీడియాలో దుమారం రేపింది. ఈ ఆరోపణలను ఏపీ దేవాదాయశాఖ చెక్ పెట్టింది. మండపాలు ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని ఆ శాఖ కమీషనర్‌ హరి జవహర్‌ లాల్‌ తెలిపారు. సంబంధిత మండపాలు ఏర్పాటు చేసేందుకు స్థానిక పోలీస్‌, రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. ఏ రకమైన రుసుము గాని, చందాలుగాని తీసుకొంటే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమీషనర్‌ హెచ్చరించారు. ఎలాంటి నిరాధార ప్రచారాన్ని ప్రజలు భక్తులు నమ్మవద్దని, వినాయ చవితి పర్వదినాన్ని భక్తశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కమీషనర్‌ కోరారు.