NewsTelangana

కేసీఆర్‌ సర్కార్‌పై యుద్ధం చేయాలి

కేసీఆర్ కుటుంబంపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలు రావడంతో … ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు కుట్ర చేశారన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందని, ప్రజలు కలిసి కేసీఆర్ సర్కార్ పై యుద్ధం చేయాలని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగులకు జీతాలు లేవన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి అని సవాల్‌ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్‌ పక్కదారి పట్టిస్తోందని, కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనే కుట్రలను పాల్పడ్డారని బండి సంజయ్‌ ఆరోపించారు. 21 రోజుల యాత్ర తర్వాత సీఎం కేసీఆర్‌కు శాంతిభద్రతలు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. సీఎం చెబితే గొడవలు అయితయ్‌… వద్దంటే ఆగిపోతాయని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై పీడీ యాక్టులు పెడుతున్నారన్న ఆయన బైంసాలో కార్యకర్తలు ఎంఐఎంను తట్టుకుని నిలబడ్డారని బండి సంజయ్‌ విమర్శించారు.