NationalNews

త్వరలో క్రికెటర్‌ రాహుల్‌ వెడ్స్‌ అతియా..!

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పెళ్లి బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో ఫిక్సయింది. ఈ విషయాన్ని స్వయంగా అతియా తండ్రి సునీల్‌ శెట్టి చెప్పారు. అయితే.. ఈ పెళ్లికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. ఆసియాకప్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లు, వరల్డ్‌కప్‌.. ఇలా రాహుల్‌కు బిజీ షెడ్యూల్‌ ఉందని.. బ్రేక్‌లోనే పెళ్లి కార్యక్రమాన్ని తలపెట్టాలనుకుంటున్నారని పేర్కొన్నారు. రాహుల్‌, అతియాల మధ్య ఎఫైర్‌ ఉందని ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలను అటు రాహుల్‌, ఇటు అతియా ఖండించలేదు. కానీ.. తాము కలిసి ఉన్న ఫొటోలను వాళ్లు తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ప్రేమ వార్తలను నిజం చేస్తూనే ఉన్నారు. అతియా తండ్రి సునీల్‌ శెట్టితో కూడా రాహుల్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి.